Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (21:35 IST)
హైదరాబాద్: యుఎస్ కేంద్రంగా కలిగిన ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్, తమ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు బ్యాంక్ యొక్క ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ వ్యూహాన్ని అమలు చేయడానికి అనువుగా భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడానికి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ కాగ్నిజెంట్‌తో సంయుక్త కార్యక్రమంను ప్రకటించింది.  
 
తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల గౌరవనీయ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, "అత్యంత వేగంగా ప్రపంచ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. 2024లో, మేము వారానికి దాదాపు ఒక జిసిసిని పొందాము, దీనితో మా మొత్తం జిసిసిల సంఖ్య 355 కు చేరుకుంది. ఈ పెరుగుదల వాణిజ్య, రిటైల్ ప్రాంగణాలకు పెరుగుతున్న డిమాండ్‌ తో పాటుగా విమాన ట్రాఫిక్‌లో పెరుగుదలలో కూడా ప్రతిబింబిస్తుంది. 2030 నాటికి, మేము 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని జోడించాలని ప్రణాళిక చేస్తున్నాము.
 
కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ బ్యాంక్ యొక్క జిసిసిని ప్రారంభించడం మా స్థానాన్ని మరింత బలపరుస్తుంది, ఇది మా పర్యావరణ వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ఐపి, ఆవిష్కరణ, ఆర్ &డి మరియు ఉత్పత్తి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ హైదరాబాద్‌ను జిసిసి హబ్ నుండి గ్లోబల్ వాల్యూ సెంటర్‌గా మార్చడం మా లక్ష్యం. ఈ దార్శనికత మా పెద్ద లక్ష్యం: రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశ జిడిపి కి $1 ట్రిలియన్‌ తోడ్పాటును అందించే మొదటి రాష్ట్రం కావడం, ఇది వృద్ధిని మరియు ఉద్యోగ సృష్టిని పెంచడంకు తోడ్పడుతుంది" అని అన్నారు. 
 
హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌లో ఉన్న జిసిసి, మరింత వేగవంతమైన, ప్రభావంతమైన పరిష్కారాలను సిటిజన్స్ తమ కస్టమర్ల కోసం  సమర్థవంతంగా పెంపొందించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్‌గా కూడా పనిచేస్తుంది, అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావటంతో పాటుగా నిరంతర అభ్యాసం, అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది. ఈ కేంద్రం మార్చి 2026 నాటికి 1,000 ఐటి, డేటా, అనలిటిక్స్ నిపుణులకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అత్యంత కీలకంగా సిటిజన్స్ “నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ” (ఎన్ జి టి) వ్యూహం ఉంది, ఇది అధునాతన సాంకేతికత, డేటా, భద్రత ద్వారా వ్యాపార విజయాన్ని వేగవంతం చేయడానికి ఆవిష్కరణలను ఉపయోగించుకుంటుంది. ఈ సంవత్సరం, సిటిజన్స్ నిరూపితమైన ప్రయోజనాలు, ఉద్భవిస్తున్న అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తూ, క్లౌడ్‌కి పూర్తిగా వలస వచ్చిన మొదటి యుఎస్ ప్రాంతీయ బ్యాంకుగా అవతరించాలని యోచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం