హైదరాబాద్-కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కుషాయిగూడలో ఓ యువకుడు కిరాతకానికి పాల్పడ్డాడు. 70 ఏళ్ల వృద్ధురాలని చంపి మృతదేహంపై డాన్సు చేశాడు. ఆ సమయంలో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఆ వీడియోలని తన మిత్రులందరికీ షేర్ చేశాడు. తన ఇంట్లో అద్దెకు వున్న యువకుడితో కమలాదేవితో అద్దె విషయంలో జగడానికి దిగింది.
అద్దె విషయంలో యువకుడిని వృద్ధురాలు మందలించింది. దీంతో ఆమెపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11వ తేదీన ఒంటరిగా ఉన్న కమలాదేవికి ఉరివేసి యువకుడు హత్య చేశాడు.
వృద్ధురాలని చంపిన తర్వాత ఆమె ఇంటికి తాళం వేసి పారిపోయాడు. అయితే ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వృద్ధురాలని చంపి పారిపోయిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.