గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఎవ్వరూ ఊహించని విధంగా రోడ్డుపై కారును ఆపించారు. కారు దిగిన చంద్రబాబు చిన్న పాటి షాపు పెట్టుకున్న మహిళతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అకస్మాత్తుగా ఓ చిన్న దుకాణం వద్ద ఆగారు.
చంద్రబాబు ఈమెను జీవనోపాధి గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆమె కష్టాలను విని చలించిపోయారు. ఆమె భర్తకు పక్షవాతం వచ్చిందని.. పనికి వెళ్లలేడని ఆ మహిళ చంద్రబాబుతో చెప్పింది. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తలలో మెదడు ప్రాబ్లమ్ ఉన్నట్లు ఆమె చెప్పారు.
పెన్షన్ కూడా రావడం లేదని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదన్నారు. ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వం నుంచి పెన్షన్ వంటివి వస్తే బాగుంటుందని చెప్పారు. దీంతో చలించిపోయిన చంద్రబాబు వెంటనే అక్కడే పక్కన ఉన్న కలెక్టర్‌ను పిలిచారు.
సదరు మహిళకు షాపు బాగా కట్టించాలని, పెన్షన్ వచ్చేలా చూడాలని.. ఆమె జీవనోపాధికి ఏం చేయాలో త్వరగా చేసిపెట్టాలని ఆదేశించారు. మహిళతో కలెక్టర్‌ను కలవాలని కూడా చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.