Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతం వర్శిటీ విద్యార్థిని ఆత్మహత్య.. ఫోనులో మాట్లాడుతూ దూకేసింది..

Advertiesment
suicide
గీతం విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని కాలేజీ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భవనం ఐదో అంతస్థు నుంచి రేణుశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్థిని ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతూనే ఒక్కసారిగా పైనుంచి కిందికి దూకింది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన రేణు శ్రీ మృతి చెందింది. 
 
ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే పటాన్‌చెరు పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేణుశ్రీ మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. రేణు శ్రీ ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో తదుపరి గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ కోసం ముందస్తు రిజర్వేషన్‌ను తెరిచిన శాంసంగ్