Publish Date: Sun, 29 Oct 2023 (13:50 IST)
Updated Date: Sun, 29 Oct 2023 (13:52 IST)
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద క్యాంపు క్లర్క్‌గా పని చేస్తూ వచ్చిన గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఆయనకు భార్య శివకృష్ణకుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్థన్ (16) ఉన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఇంటికి వెళ్లలేదు.
గత రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణువర్థన్ మాట్లాడాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ, ఈ ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద కాలిన గాయాలతో ఆయన మృతి చెంది కనిపించారు. మరోవైపు, ఆయన గత నెల రోజులుగా సెలవులో ఉన్నట్టు తెలుస్తుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్న పోలీసులు హత్యా.. ఆత్మహత్యా అని కోణలో దర్యాప్తు చేస్తున్నారు.