Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు విస్తరణ పనులు... అడ్డుగా ఉన్న సొంతింటిని కూల్చి వేయించిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎక్కడ?

Advertiesment
demolish

వరుణ్

, ఆదివారం, 28 జనవరి 2024 (17:10 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మరోమారు వార్తల్లో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను చిత్తుగా ఓడించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు ఆయన వార్తలకెక్కారు. రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా వస్తుందని తెలియడంతో దగ్గరుండి మరీ తన ఇంటిని కూల్చివేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక కామారెడ్డి రోడ్ల విస్తరణపై కాటిపల్లి ప్రత్యేకంగా దృష్టిసారించారు. కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని భావించి, తన ఇంటి నుంచే కూల్చివేతలు మొదలుపెట్టానని, ఇది గొప్ప పనో.. త్యాగమో కాదన్నారు. ఆక్రమణల తొలగింపు తన నుంచి మొదలైతే నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ క్రమంలోనే ఆయన అధికారులతో కలిసి దగ్గరుండిమరీ తన ఇంటిని కూల్చివేయించారు. రోడ్డు విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణ కోసం ఈ రజోు తన ఇంటిని నేనే కూల్చేస్తున్నానని తెలిపారు. తాను చేసింది గొప్ప విషయమో లేక త్యాగం చేశాననో తాను భావించడం లేదని, రాజు ప్రజలకు అండగా ఉండాలని, అందుకే ఓ ఎమ్మెల్యేగా రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని కూల్చేస్తే ప్రజలకు ఆదర్శంగా నిలిచినట్టవుతుందని చెప్పారు. ప్రజలు అర్థం చేసుకుంటారని భావించానని తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. తమ ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని తన ఇంటిని కూల్చివేయించినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ శాసనసభలో పార్టీల బలాబలాలు ఎంత?