Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్ శాసనసభలో పార్టీల బలాబలాలు ఎంత?

nitish kumar

వరుణ్

, ఆదివారం, 28 జనవరి 2024 (16:24 IST)
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. గత ఎన్నికల్లో రెండు అతిపెద్ద పార్టీలుగా అవతరించిన ఆర్జీడీ, బీజేపీలతో జేడీయూ నేత కర్చీలాట ఆడుతున్నారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత తొలుత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీని పక్కనబెట్టి.. ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇపుడు ఆర్జేడీకి కాదని మళ్లీ బీజేపీతో చేతులు కలిపి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్ర శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, 
 
మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ శాసనసభలో గత ఎన్నికల్లో 79 సీట్లను గెలుచుకున్న ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 78, జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు, సీపీఐ ఎంఎల్‌కు 12, హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ పార్టీకి నాలుగు, సీపీఐ రెండు, సీపీఎం రెండు, ఎంఐఎం ఒక చోటు గెలుపొందాయి. ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ సాధించిన సీట్లు కేవలం 45 మాత్రమే. కానీ, ఆయన చక్రం తిప్పుతూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు కావాలి. కానీ, బీజేపీకి 78, జేడీయూకు 45 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు... కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్స్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీశ్ కుమార్ సిద్ధమయ్యారు. ఇ్పటికే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన కొత్త ప్రభుత్వాన్ని నేడో రేపో ఏర్పాటు చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్ఞానవాపి మసీదు కింద దేవాలయం ఉన్నట్టు ఏఎస్ఐ నివేదికలో లేదు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు