Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Advertiesment
beet bottle attack

ఠాగూర్

, మంగళవారం, 25 మార్చి 2025 (17:08 IST)
హైదరాబాద్ నగరంలో దౌర్జన్యాలు, దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా పట్టపగలు నడి రోడ్డుపై ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ బైకర్ బీరు బాటిల్‌తో దాడికి తెగబడ్డాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ వద్దే ఈ దాడి జరిగింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అతి వేగంగా వచ్చిన బైకర్ ఖాజా ఓ కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్రైవర్, బైకర్ ఖాజాలు ఇద్దరూ నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. వారిద్దరిని వారించేందుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ ప్రయత్నించాడు. 
 
అయితే, బైకర్ ఖాజా ఆగ్రహంతో ఊగిపోతూ పక్కనే ఉన్న బీరు బాటిల్‌ను తీసుకుని కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు బలమైన గాయం తగిలింది. కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బైకర్ ఖాజాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు