Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతంత్ర దినోత్సవ సంబరాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక ట్రావెల్ బుకింగ్స్

Green Metro Luxury AC buses

ఐవీఆర్

, శనివారం, 10 ఆగస్టు 2024 (19:18 IST)
ఈసారి స్వాతంత్ర దినోత్సవం వేళ లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో తమ సొంతూళ్లకో లేదా టూరిస్ట్ ప్లేస్‌లకో వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమైపోయారు. దీనికి తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ట్రావెల్స్ బుకింగ్స్ కు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఆగస్ట్ 17 నుంచి 19 వరకు వరుస సెలవలు రావడంతో ప్రయాణికులు టూర్లకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది రెడ్ బస్. గత వారంతో పోలిస్తే ఈ వారంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 29 శాతం అత్యధికంగా సీట్లు బుక్ అవుతున్నట్లు తెలిపింది రెడ్ బస్. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆర్టీసీ సర్వీసులు, అలాగే బస్ ఆపరేటర్లు కూడా దాదాపు 8000 వేలకు సర్వీసుల్ని సిద్ధంగా ఉంచుతున్నారు.
 
ప్రయాణికుల రద్దీ, వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెడ్ బస్ కూడా అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రయాణికుల కోసం అత్యధిక సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం BIGBREAK అనే కూపన్ కోడ్‌ని సరికొత్త వినియోగదారులకు సిద్ధం చేసింది. దీనిద్వారా మొదటిసారి రెడ్ బస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు 24 శాతం డిస్కౌంట్‌తో రూ.500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే రెడ్ బస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులు BUS300 కూపన్ కోడ్ ఉపయోగించి ఆఫర్లను పొందవచ్చు.
 
ఎక్కువ ట్రాఫిక్ ఉండే టాప్ రూట్లు:
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బయట ఉన్న రూట్లు
హైదరాబాద్-బెంగళూరు
విజయవాడ-బెంగళూరు
నెల్లూరు-బెంగళూరు
గుంటూరు-బెంగళూరు
హైదరాబాద్-పుణే
 
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర రూట్లు
·విజయవాడ-హైదరాబాద్
·విశాఖపట్నం-హైదరాబాద్
·తిరుపతి-బెంగళూరు
·రాజమండ్రి-హైదరాబాద్
 
ఈ సీజన్ టాప్ బోర్డింగ్ పాయింట్స్
మియాపూర్
కూకట్ పల్లి
లక్డీకాపూల్
గచ్చీబౌలి
బెంజ్ సర్కిల్
వారధి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం లోని అల్ట్రాటెక్ లైమ్‌స్టోన్ గనికి 5 స్టార్ రేటింగ్