Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతపురం లోని అల్ట్రాటెక్ లైమ్‌స్టోన్ గనికి 5 స్టార్ రేటింగ్

Kishan Reddy

ఐవీఆర్

, శనివారం, 10 ఆగస్టు 2024 (18:55 IST)
అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు చెందిన పన్నెండు లైమ్‌స్టోన్ మైన్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఈ అవార్డులను 2024న ఆగస్టు 7న దిల్లీలో గౌరవనీయులైన బొగ్గు-గనుల శాఖ మంత్రి బహుకరించారు. అవార్డు పొందిన పన్నెండు గనులలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలోని తుమ్మలపెంట లైమ్‌స్టోన్ గని ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, అల్ట్రాటెక్ ఇంటిగ్రేటెడ్ యూనిట్‌లో భాగం. ఈ యూనిట్ ఈ అవార్డును గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి.
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గౌరవనీయ బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారు భారత్ లోని అతిపెద్ద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ని మైనింగ్- భారతదేశపు మైనింగ్ రంగానికి దోహదపడిన అన్ని అంశాలలో ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించినందుకు సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే కూడా పాల్గొన్నారు. మైనింగ్‌లో ఉత్కృష్టత సాధించేందుకు అల్ట్రాటెక్ చేసే ప్రయత్నాలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర మైనింగ్, సమర్థవంతమైన కార్యకలాపాలు, సాంకేతికతతో నడిచే మినరల్ ప్రాసెసింగ్ దిశగా ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి అన్ని రకాలైన మినరల్స్ (లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్, బాక్సైట్, లీడ్ జింక్, మాంగనీస్)లో అత్యధిక సంఖ్యలో గనులకు 5-స్టార్ రేటింగ్‌ను అల్ట్రాటెక్ పొందింది.
 
గనుల మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడిన, స్టార్ రేటింగ్‌లు గనుల తవ్వకంలో సుస్థిరదాయక అభివృద్ధి చట్రం సమగ్ర- సార్వత్రిక అమలు కోసం ఉత్తమ పద్ధతులను అనుసరించడంపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ, సమర్థవంతమైన మైనింగ్, ఆమోదించబడిన ఉత్పత్తికి అనుగుణంగా ఉండడం, జీరో వేస్ట్ మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీలకంగా ఉండడం, చివరకు గని మూసివేతకు తీసు కున్న చర్యలు, గ్రీన్ ఎనర్జీ ఉపయోగించడం, శక్తి వనరులు, భూమి, అంతర్జాతీయ ప్రమాణాలను స్వీకరిం చడం, స్థానిక సంఘాలతో కలసి పని చేయడం, సంక్షేమ కార్యక్రమాలు, పునరావాసం, ఇతర సామాజిక ప్రభావాలు వంటి పారామితులపై అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనులకు రేటింగ్ పథకంలో అత్యధికంగా 5-స్టార్ రేటింగ్ ఇవ్వబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో.. వైకాపాకు కొత్త తలనొప్పి.. జగన్ ఏం చేస్తారో?