Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విధుల్లో నిర్లక్ష్యం.. తాడిపత్రిలో హింసకు కారణమైన పోలీస్ అధికారిపై వేటుపడింది!!

tadipatri

ఠాగూర్

, సోమవారం, 27 మే 2024 (09:11 IST)
విధుల్లో నిర్లక్ష్యంగా వహించడం వల్ల తాడిపత్రిలో హింస చెలరేగిందని జిల్లా ఎస్పీ ఇచ్చిన వేదిక ఆధారంగా అదునపు ఎస్పీపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల తాడిపత్రిలో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత హింస చెలరేగిన విషయం తెల్సిందే. ఈ హింసకు కారణం అదనపు ఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణ రెడ్డి తన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటమే ప్రధాన కారణమని శాఖాపరమైన విచారణలో తేలింది. దీంతో ఆయనపై ఈసీ వేటు వేసింది. ఈయనను అనంతపురం రేంజి డీఐజీ, డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు.
 
తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని గత ఎస్పీ అమిత్ బర్దర్ కోరగా, బలగాలు తగినన్న లేవంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహించారని లక్ష్మీనారాయణ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అదనపు బలగాలు పంపకపోవడంతో అల్లర్లు పెరిగినట్టు అమిత్ బర్దర్ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ అల్లర్లకు బాధ్యులను చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీఅమిత్ బర్దర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. 
 
ఆ తర్వాత జిల్లా ఎస్పీగా అమిత్ సాలిని ఈసీ నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడిపత్రి అల్లర్లపై ప్రత్యేక దృష్టిసారించి లోతుగా దర్యాప్తు జరిపారు. ఇందులోభాగంగా, ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని పిలిచి విచారణ జరిపారు. ఇందులో ఆయన నిర్లక్ష్యపూరితంగాను, పొంతనలేని విధంగా సమాధానాలు చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ రెడ్డి తీరుపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనపై వేటుపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ టర్బులైన్స్ బారినపడిన మరో విమానం!!