మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు. సిట్ దర్యాప్తులో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.