Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Allu Arjun Arrest: నేరుగా బెడ్ రూమ్ వరకు వచ్చేశారు.. దుస్తులు మార్చుకోనివ్వలేదు.. (videos)

Allu Arjun

సెల్వి

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (15:04 IST)
Allu Arjun
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌కు తీవ్ర సమస్యలను తెచ్చిపెట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఈ థియేటర్‌లో "పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ, "అల్లు అర్జున్ రాకతోనే తొక్కిసలాట జరిగింది” అని అన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్‌పై 105, 118(1)r/w3(5) BNS చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. కానీ అరెస్ట్‌పై బన్నీ అసంతృప్తి వ్యక్తం చేశారు. "నన్ను అరెస్టు చేయడం తప్పు కాదు, కానీ బెడ్ రూమ్‌లోకి వచ్చి దుస్తులు మార్చడానికి కూడా సమయం ఇవ్వకుండా తీసుకెళ్లడం సరికాదు" అని అల్లు అర్జున్ తప్పుపట్టారు. ఈ సంఘటనపై, అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Fun moments: ఏపీ కలెక్టర్ల సదస్సులో పేలిన చలోక్తులు.. నవ్వుకున్న పవన్ కల్యాణ్ (video)