Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Advertiesment
ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...
, మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రాజెనెకా మధుమేహ ఔషధం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం