ఫిఫా మహిళల అండర్-17 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీ అక్టోబరు 11 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ భారీ టోర్నీ నిర్వహణ కోసం కేంద్రం ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు రూ.10 కోట్ల సాయం అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో క్రీడలకు నిధులు పెంచామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ ద్వారా మోదీ సర్కారు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని వివరించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.
భారత్‌లో ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించిన పూచీకత్తుల ఫైలుపై సంతకం చేసేందుకు క్యాబినెట్ ఆమోదించిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.