Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 యేళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సిద్ధం

18 యేళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సిద్ధం
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (09:42 IST)
దేశంలో 18 యేళ్లలోపు చిన్నారులకు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమైంది. 12 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా 'కోర్బెవాక్స్'ను కేంద్రం అనుమతి ఇచ్చింది. 
 
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా పరిశోధనా సంస్థ "బయోలాజికల్ ఈ" అనే కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కూడా అనుమతి ఇచ్చింది. 12 యేళ్ల నుంచి 18 యేళ్ల లోపు వారికి అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. 
 
కాగా, దేశంలో ఇప్పటివరకు 15 యేళ్ళ నుంచి 18 యేళ్లలోపు వారికి భారత్ బయోటికె తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను వేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు చిన్నారుల కోసం కొత్తగా కోర్బెవాక్స్ అందుబాటులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీఎస్ ఆర్టీసీకి షాకిచ్చిన చమురు కంపెనీలు.. చార్జీల వడ్డన తప్పదా?