Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణానదిలో ఈత నేర్చుకున్న భారత తొలి ఒలింపియన్ షంషేర్ ఖాన్ ఇకలేరు...

భారత తొలితరం ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ ఇకలేరు. భారత్ తరపున ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొన్ని తొలి స్విమ్మర్‌గా రికార్డులకెక్కిన మెహబూబ్‌ షంషేర్‌ ఖాన్‌.. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల

Advertiesment
కృష్ణానదిలో ఈత నేర్చుకున్న భారత తొలి ఒలింపియన్ షంషేర్ ఖాన్ ఇకలేరు...
, సోమవారం, 16 అక్టోబరు 2017 (10:27 IST)
భారత తొలితరం ఒలింపియన్ స్విమ్మర్ షంషేర్ ఖాన్ ఇకలేరు. భారత్ తరపున ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొన్ని తొలి స్విమ్మర్‌గా రికార్డులకెక్కిన మెహబూబ్‌ షంషేర్‌ ఖాన్‌.. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ హీట్స్‌లో ఐదో స్థానం, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ హీట్స్‌లో ఆరో స్థానం సాధించారు. వృద్దాప్యంతో ఇంటికే పరిమితమైన ఆయనకు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 యేళ్లు. కృష్ణానదిలో ఈత నేర్చుకుని ఒలింపిక్స్‌కు వెళ్లిన ఘనత షంషేర్ ఖాన్‌ది. 
 
1930 ఆగస్టు 2న జన్మించిన షంషేర్‌ ఖాన్‌ సొంతూరు గుంటూరు జిల్లా రేపల్లె. ఎలాంటి కోచ్‌లు, సదుపాయాలు లేకుండానే ఈత నేర్చుకున్నారు. 16 ఏళ్ల వయస్సులో 1946లో బెంగళూరులోని సదరన్‌ కమాండ్‌లో ఆర్మీలో చేరిన ఆయన… అక్కడి స్విమ్మింగ్‌ పూల్‌‌లో మెలకువలు నేర్చుకుని.. నేషనల్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచారు.
 
ఆ తర్వాత 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌‌లో పాల్గొనే అవకాశాన్ని పొందారు. ఓ సాధారణ స్విమ్మర్ గా అడుగుపెట్టిన ఆయన.. మెరుగైన ఫలితాలు సాధించారు. ఆ తర్వాత మిలిటరీ పనులలో బిజీ అయి.. మొత్తం క్రీడలకే దూరమైయ్యారు. వెళ్లి వచ్చిన తర్వాత ఆర్మీలో రకరకాల విధుల కారణంగా స్విమ్మింగ్‌కు దూరమయ్యారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1973లో సుబేదార్‌ హోదాలో ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యాక కొన్నేళ్ల పాటు సికింద్రాబాద్‌ ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేసి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అక్కడే తన జీవితపు చివరి రోజులను గడిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘాన్ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ సక్సెస్ సందేశాలు...