Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోటి విద్యలు కూటి కొరకే : వరల్డ్ ఫుడ్ డే

కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనిషి ప్రాథమిక అవసరాల్లో ఆహారం అత్యవసరం. కడుపుకి తిండి లేనిదే మనిషి మనుగడ సాగదు. అందుకే ప్రతి మనిషికీ ఆహారం అనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్

కోటి విద్యలు కూటి కొరకే : వరల్డ్ ఫుడ్ డే
, సోమవారం, 16 అక్టోబరు 2017 (09:57 IST)
కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనిషి ప్రాథమిక అవసరాల్లో ఆహారం అత్యవసరం. కడుపుకి తిండి లేనిదే మనిషి మనుగడ సాగదు. అందుకే ప్రతి మనిషికీ ఆహారం అనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతియేటా అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే జరుపుతోంది. తొలిసారి 1981లో ఈ వరల్డ్ ఫుడ్ డే నిర్వహించింది. ఇందులో మొత్తం 191 సభ్య దేశాలున్నాయి. 150కి పైగా దేశాలు ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. 
 
కాగా, భారత్‌లో ఆకలి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాజాగా వెల్లడైన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితాలో భారత్ 100వ స్థానంలో ఉంది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెబుతోంది ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ).
 
హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజూ 20 శాతం ఆహారం నేలపాలవుతోందని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని గ్రహించిన స్వచ్ఛంద సంస్థలు… ఆహారం వృధాకాకుండా.. వాటిని సేకరించి పేదలకు పంచిపెడుతున్నాయి. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ప్రభుత్వ హాస్పిటల్స్, అనాథ, వికలాంగ, వృద్ధాశ్రమాల వద్దకు స్వయంగా వెళ్లి వందలాది మంది అన్నార్థుల కడుపునింపుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది : ట్రెంట్ ఫ్రాంక్స్