యూఎస్ టెన్నిస్ టోర్నీ పురుషుల టైటిల్‌ను రఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. తన కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ తుది సమరంలో అద్భుత ప్రదర్శన చేశాడు.
ఐదుసెట్ల పోరులో హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు. ఫురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న ఫెదరర్(20)ను అందుకోవడానికి ఒక్క విజయం దూరంలో నిలిచాడు 33ఏండ్ల రఫెల్.
యూఎస్ ఓపెన్‌లో రఫాకిది నాలుగోది కావడం విశేషం. యూఎస్ ఓపెన్‌లో రఫెల్ ఫైనల్ ఆడటం ఇది ఐదోసారి కాగా.. గతంలో మూడుసార్లు 2017, 2013, 2010లో విజేతగా నిలిచాడు. 2011లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో రఫెల్ మొత్తం 84 టైటిల్స్ నెగ్గగా... అందులో 21 హార్డ్‌కోర్టులో గెలిచాడు.
టైటిల్‌పోరులో రష్యా క్రీడాకారుడు, ఐదోసీడ్ మెద్వెదేవ్ రెండో సీడ్ నాదల్‌కు గట్టిపోటీనిచ్చాడు. నాదల్ ఐదు.. మెద్వెదేవ్ 14 ఏస్‌లను సంధించారు. నాదల్ 62.. మెద్వదేవ్ 75 విన్నర్లు కొట్టాడు. మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసిన రష్యా ప్లేయర్ మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ 46 తప్పిదాలు చేయగా.. డానిల్ 57 తప్పులు చేశాడు.
కొన్నేండ్లుగా కఠోర సాధన చేస్తూ.. అన్ని టోర్నీల్లోనూ సత్తాచాటుతూ వస్తున్న మెద్వెదేవ్‌కు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలన్న కోరిక నెరవేరలేదు. దిగ్గజ యోధుడికి సమానంగా పోరాడిన మెద్వెదేవ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో పట్టుదలతో, అంకితభావంతో అద్భుత పోరాటం చేశావని కొనియాడుతున్నారు.