యూఎస్ ఓపెన్ : సెరెనా దూకుడుకు కళ్లెం వేసిన బియాంక

ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (16:03 IST)
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచలనం నమోదైంది. న్యూయార్క్ కేంద్రంగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సెరేనా విలియమ్స్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో బియాంక సెరేనాపై 6-3, 7-5 సెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. ఈ విజయంతో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న తొలి కెనడియన్‌ బియాంక చరిత్ర సృష్టించింది. 
 
గత రెండేళ్లలో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆడేందుకు అర్హత కూడా పొందలేకపోయిన బియాంక, ఈసారి ఏకంగా యూఎస్ ఓపెన్ కప్‌ను ఎత్తుకుపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో విజయంతో ఏడో యూఎస్ ఓపెన్ కప్‌ను దక్కించుకోవాలన్న సెరేనా ప్రయత్నం నెరవేరలేదు. 
 
సెరేనా ఖాతాలో ప్రస్తుతం 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. మరోటి గెలిస్తే ఆల్ టైం గ్రేట్ మార్గరెట్ కోర్ట్ రికార్డును సెరేనా సమం చేసే అవకాశముంది. కానీ, కెనడా యువతి ఆమె ఆశలకు గండికొట్టింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లసిత్ మలింగ హ్యాట్రిక్.. 4 బంతుల్లో 4 వికెట్లు