భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోచ్‌ను మార్చేసింది. ఇప్పటివరకు కోచ్‌గా వ్యవహరించిన దక్షిణ కొరియాకు చెందిన పార్క్ తే సంగ్‌ను పక్కనబెట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించింది పీవీ సింధు. పార్క్-సింధు కలిసి 2019 నుంచి కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో.. ఈయన కోచింగ్‌లో సింధు పలు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
వీటిలో మూడు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిళ్లు, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్, స్విస్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లు వున్నాయి. అలాగే, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత ఎడమకాలి గాయం కారణంగా సింధు దాదాపు ఐదు నెలల విరామం తీసుకుంది. ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. దీంతో సింధు-పార్క్‌ల జర్నీకి బ్రేక్ పడింది. పీవీ సింధు పరాజయాలకు పూర్తి బాధ్యత తనదేంటూ పార్క్ ఆ పోస్టులో పేర్కొన్నాడు.
సింధు మార్పును కోరుకుందని, మరో కోచ్‌ను వెతుక్కుంటోందన్న పార్క్.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పుకొచ్చాడు.