జూనియర్ డెవిస్ కప్ అండర్-16 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టెన్నిస్ పోటీల్లో సూపర్ టై బ్రేక్ సింగిల్స్ మ్యాచ్‌లలో భారత క్రీడాకారులు ప్రకాశ్ శరణ్, తన్విష్ పహ్వాలు విజయం సాధించారు. ఇందులో ఓ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాడు అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది.
పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆటగాడు భారత ఆటగాడితో కరచాలనం చేసే క్రమంలో అమర్యాదగా ప్రవర్తించినట్టు ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురైన అతను... భారత క్రీడాకారుడుతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు.
చివరకు చేయి కలిపినా నిర్లక్ష్యంగా చేతితో కొడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అహంకారపూరితంగా ప్రవర్తించిన ప్రత్యర్థి తీరు నచ్చనప్పటికీ భారత ఆటగాడు మాత్రం ఎంతో హుందాగా నడుచుకున్నాు. దీనికి సంబంధించిన వీడియోను ఖేల్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.