Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతి విశ్వాసంతో సొంత గడ్డపై చిత్తుగా ఓడిన భారత్ : బాసిత్ అలీ

teast team india

ఠాగూర్

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (10:58 IST)
స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. పర్యాటక న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆ జట్టు ఓటమిపాలైంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పందించారు. స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల అతివిశ్వాసం వల్లే కివీస్ జట్టు చేతిలో ఓడిపోయిందని పేర్కొన్నారు. 
 
అలాగే, పాకిస్థాన్ క్రికెట్ కోచ్ బాధ్యతలకు గ్యారీ కీర్‌స్టెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ రిజ్వాన్‌ను జట్టు వైట్‌బాల్ కెప్టెన్‌గా నియమించిన తర్వాత కీర్‌స్టెన్‌కు కోపం వచ్చిందని తెలిపాడు. ఎందుకంటే ఆయన కెప్టెన్‌గా వేరే ఆటగాడి పేరును సూచించినట్టు బాసిత్ అలీ చెప్పాడు. గ్యారీ మాట చెల్లకపోవడంతో తన పదవి నుంచి వైదొలిగినట్లు చెప్పుకొచ్చాడు.
 
అటువంటి నిర్ణయాలకు తనకు పూర్తి అధికారం ఉందని గ్యారీ విశ్వసించాడని మాజీ క్రికెటర్ తెలిపాడు. కానీ, ప్రస్తుతం పీసీబీ చైర్మన్ మోస్సిన్ నఖ్వీ చాలా శక్తిమంతమైన వ్యక్తి, ఆయన నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించలేరన్నాడు. అందుకే గ్యారీ జాబ్ పోయిందని బాసిత్ అలీ పేర్కొన్నాడు.
 
"ఇదంతా రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతోనే ప్రారంభమైంది. గ్యారీ వేరే ఆటగాడు నాయకత్వం వహించాలని కోరుకున్నాడు. అతను ప్రస్తుత జట్టులో లేని వ్యక్తి. ఇలాంటి నిర్ణయాల్లో తనకు పూర్తి అధికారం ఉందని అతను భావించాడు. కానీ మన దగ్గర పీసీబీ ఛైర్మన్ మోస్సిన్ నఖ్వీ ప్రస్తుతం చాలా శక్తిమంతమైన వ్యక్తి అని అతను గుర్తించలేకపోయాడు. రాత్రికి రాత్రే ఉద్యోగం పోయింది" అని బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11: పట్నా పైరేట్స్‌పై 28-26తో తెలుగు టైటాన్స్‌ విజయం