యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ల కోసం రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రత్యేకమైన ప్రసార స్ట్రీమింగ్ హక్కులను జియోస్టార్ పొందినట్లు ప్రకటించింది. ఈ మైలురాయి భాగస్వామ్యంతో యూఎస్‌టీఏ బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్ హార్డ్ కోర్టుల నుండి ప్రతి మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జియో హాట్ స్టార్‌లో ప్రసారం చేస్తుంది. ప్రతీ మ్యాచ్‌ను నేరుగా లక్షలాది భారతీయ స్క్రీన్‌లకు అందిస్తుంది. ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్‌లలో ఒకటనేది తెలిసిందే.
కార్లోస్ అల్కరాజ్, ఇగా స్విటెక్, నోవాక్ జొకోవిచ్, కోకో గౌఫ్ కోర్టులోకి దిగగా, జానిక్ సిన్నర్, అరినా సబలెంకా వరుసగా తమ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిళ్లను గెలుచుకోవాలని చూస్తున్నారు.
జియోస్టార్ తన కవరేజ్‌లో భాగంగా, ప్రపంచంలోనే అత్యధికంగా హాజరయ్యే వార్షిక క్రీడా కార్యక్రమాలను టార్గెట్ చేస్తోంది. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్‌ల విస్తరిస్తున్న పోర్ట్‌ఫోలియోకు యుఎస్ ఓపెన్‌ను జోడించడం మాకు చాలా ఆనందంగా ఉంది.
USTAతో ఈ అనుబంధం మా ప్లాట్‌ఫామ్‌లలో అభిమానులకు అందుబాటులో ఉన్న ప్రీమియర్ గ్లోబల్ స్పోర్ట్స్ కంటెంట్ పరిధిని మరింతగా పెంచుతుందని జియోస్టార్ ఇంటర్నేషనల్ అక్విజిషన్స్ అండ్ సిండికేషన్ హెడ్ హ్యారీ గ్రిఫిత్ అన్నారు.
యుఎస్ ఓపెన్‌తో, జియోస్టార్ ఇప్పుడు నాలుగు ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్‌లలో రెండింటికి నిలయంగా ఉంది. ఏడాది పొడవునా టెన్నిస్ కవరేజీని అందిస్తోంది.