టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లోభాగంగా టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్‌కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా రూ.3 కోట్ల నగదు ఇవ్వనున్నట్టు తెలిపింది.
గుజరాత్ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా... పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ యింగ్ ఝోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది.
పతకం సాధించిన భవీనాను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అంటూ కితాబిచ్చారు. 'దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ.3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.