Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకలా అర్థమైందా? ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటో ఎవరదండీ...

Advertiesment
మీకలా అర్థమైందా? ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటో ఎవరదండీ...
, బుధవారం, 20 అక్టోబరు 2021 (17:56 IST)
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారకుడు. ఇది అందరికీ తెలిసిందే. పట్టాభిరాం ఇంటిపై దాడికి ప్రయత్నించారు వైసిపి కార్యకర్తలు. పట్టాభిరాం ఎప్పుడూ టివీల్లో కనిపిస్తూ ఉంటాడు. 

 
అలాంటి వ్యక్తి గురించి ఆందోళన చేయాల్సిన వైసిపి కార్యకర్తలు మరొక పట్టాభి ఫోటోతో ప్రత్యక్షమయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరంలో జరిగింది. గన్నవరం తహశీల్ధార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

 
ఆ ఫ్లెక్సీలో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు బదులు ఆంధ్రాబ్యాంక్ వ్యవస్ధాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును పెట్టారు. సిఎంపై దుర్భాషలాడిన కొమ్మారెడ్డి పట్టాభిరాం పేరుకు బదులు వైసిపి నాయకులు వేరే వ్యక్తి ఫోటో పెట్టడం విమర్సలకు తావిస్తోంది. 

 
ఫ్లెక్సీ పట్టుకుని మరీ నేతలు నిరసనకు దిగడం కొసమెరుపు. చాలాసేపటి వరకు ఆ ఫోటో ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు. అయితే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు పట్టాభి ఇతను కాదని చెప్పడంతో ఫ్లెక్సీని పక్కకు తీసుకెళ్ళి పడేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ట‌ర్ ప్రేమికుడు-గా ప్ర‌భుదేవా