శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో 300 రూపాయల శ్రీవారి దర్శన టిక్కెట్లను మాత్రమే విడుదల చేసింది.
అయితే, వచ్చే నెల కోటాకు సంబంధించిన అన్ని టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం గమనార్హం. అంటే కేవలం 40 నిమిషాల్లోనే అమ్ముడు పోయాయి.
అలాగే, శనివారం ఉదయం 9 గంటలకు టైమ్ స్టాట్ సర్వదర్శన టిక్కెట్లను తితిదే విడుద చేయనుంది. సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా తితిదే ఆన్‌లైన్‌లోనే ఈ టిక్కెట్లను విక్రయిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.