తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వ్యాక్సినేషన్ పూర్తి కాని వాళ్లు దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే దర్శనానికి రావాలని సూచించింది.
ఈ విషయంపై గతంలోనే ప్రకటన చేసినప్పటికీ భక్తులు ఈ నిబంధనను పట్టించుకోకుండా వచ్చేస్తున్నారని, అందుకే మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
పలువురు భక్తులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏదీ లేకుండా వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కి పంపాల్సి వస్తోందని, దీంతో భక్తులు ఇబ్బందికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దయచేసి ఈ రిపోర్ట్స్ లేకుండా ఎవరూ తిరుమల రావొద్దని సూచించారు.