కోవిడ్ కారణంగా ఆన్ లైన్ లోనే టిక్కెట్లను టిటిడి మంజూరు చేస్తోంది. ఉచిత దర్సన టోకెన్లయినా, 300 రూపాయల దర్సనం టోకెన్లు అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఆన్ లైన్ లోనే పొందాల్సిన పరిస్థితి. అందులోను కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని టిటిడి తీసుకుంటోంది.
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్సనం కోటాను ఈనెల 27వ తేదీన విడుదల చేసేందుకు సిద్థమైంది టిటిడి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనుంది టిటిడి.
అలాగే ఫిబ్రవరి నెలలో సర్వదర్సనం టోకెన్లకు సంబంధించి ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్లో టోకెన్లను అందించనుంది. పరిమిత సంఖ్యలోనే టోకెన్లను విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్సనం టోకెన్లను పొందాలని.. కోవిడ్ వ్యాక్యినేషన్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. గతంలోలా సర్టిఫికెట్ తీసుకొచ్చినా టిటిడి అధికారులు చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉంటేనే దర్సనానికి అనుమతిస్తామని టిటిడి స్పష్టం చేస్తోంది.