కోవిడ్ తగ్గుముఖం పట్టిన వెంటనే సర్వదర్సనం టోకెన్లను మంజూరు చేస్తామన్నారు టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి. ఫిబ్రవరి 15వ తేదీ తరువాత కౌంటర్ల ద్వారా సర్వదర్సనం టోకెన్లను అందించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. కోవిడ్ కేసులు తగ్గితే మార్చితే 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్దరణ, పలు సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.
స్వామివారి దర్సనం టిక్కెట్లు విక్రయించే నకిలీ వెబ్ సైట్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులను వదిలిపెట్టమన్నారు. టిటిడికి సంబందించిన అధికారిక వెబ్ సైట్ లోనే దయచేసి భక్తులు టోకెన్లను పొందవచ్చునన్నారు.
త్వరలో శ్రీవారి నడక మార్గం పునరుద్ధణ పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చేందుకు మూడు నెలలకు పైగా సమయం పడుతుందన్నారు.
బండరాళ్ళు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించే విధంగా సాంకేతికను తీసుకొస్తున్నామన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన అంజనాద్రి అభివృద్థి పనులకు భూమి పూజ చేస్తున్నామన్నారు.