దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు

గురువారం, 22 ఆగస్టు 2019 (14:37 IST)
విజయవాడలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా సురేష్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆయనకు ఆలయ వేదపండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దివ్యాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహామండపం ఏడో అంతస్తులో ఉన్న ఈవో కార్యాలయంలో సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ గుడి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. సురేష్‌ బాబు ఇప్పటివరకు అన్నవరం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నీ వైపుకు నేనొస్తే.. నువ్వేమో ఇలా అంటున్నావే..? శ్రీకృష్ణుడు