ఎల్లప్పుడు ఇతరులకు శ్రద్ధతో ప్రేమ పూర్వకంగా సేవ చేయుము. కానీ దానికి మారుగా వారి నుండి తిరిగి ప్రేమను, సేవను ఆశించకుము.
క్షమా గుణము సాధు సజ్జత్వమునకు ముఖ్య లక్షణము.
ఇతరుల దోషములను వేలెత్తి చూపుటకు ముందు తమ దోషములను తొలగించుకోవడం మంచిది.
ఎవరితో మాట్లాడినను మధురముగా, ప్రియముగా మాట్లాడుట అలవర్చుకొనుము. ఇతరులను నొప్పించునట్లు మాట్లాడవలదు.
సత్యమున్నచోట తప్పక జయము కలుగుతుంది.
ఎవరైనా మనల్ని దుష్టబుద్ధితో చూచిన చూడనిమ్ము. మనం మాత్రం ఎల్లప్పుడు ప్రేమ దృష్టితోనే చూడవలెను.
మనసు అస్వస్థతగా వున్నా, చెడు తలంపులు మనసు నందు కలిగినా వెంటనే బలవంతంగా మనస్సును నామస్మరణవైపుకు మరలించుము.
పరమేశ్వరుడు ఆనందస్వరూపుడు. అందువల్ల పరమేశ్వరుని చరణములందు మనఃపూర్వకంగా, శ్రద్ధాసక్తులను వుంచి యదార్థమైన ఆనందము పొందేందుకు ప్రయత్నించాలి.