Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీవితంలో సంతోషం ఎప్పుడు? (video)

జీవితంలో సంతోషం ఎప్పుడు? (video)
, సోమవారం, 23 మే 2022 (22:13 IST)
చాలామంది తమ వద్ద లేని దాని గురించి పదేపదే ఆలోచిస్తుంటారు. వారు తమను తాము మరొకరితో పోల్చుకోవడమే దీనికి కారణం. మోటర్‌బైక్ నడుపుతున్నారనుకోండి, మెర్సిడెస్‌లో వెళ్లేవారిని చూస్తారు. అలా దయనీయంగా మార్చుకుంటారు.


సైకిల్‌పై వెళ్లే వ్యక్తి మోటర్‌బైక్‌లో వెళ్లే వ్యక్తి వైపు చూస్తాడు.  వీధిలో నడుచుకుంటే వెళ్లే వ్యక్తి సైకిల్‌ని చూసి, “అబ్బా, నా దగ్గర అది ఉంటే, నేను నా జీవితాన్ని ఏమి చేసి ఉండేవాడిని!” అని అనుకుంటాడు. ఇది ఒక మూర్ఖపు గేమ్, ఈ ఆలోచన విధానం మారాలి.

 
సంతోషంగా ఉండటానికి బాహ్య పరిస్థితులపై ఆధారపడే వారందరికీ వారి జీవితంలో నిజమైన ఆనందం తెలియదు. ఇది ఖచ్చితంగా మనం లోపలికి చూసే సమయం, వ్యక్తిగత శ్రేయస్సును ఎలా సృష్టించుకోవాలో చూడాలి. స్వంత జీవితానుభవం నుండి, అంతర్గత స్వభావం మారితేనే నిజమైన శ్రేయస్సు వస్తుందని స్పష్టంగా చూడవచ్చు.
 
 



 
ఆనందాన్ని కలిగించడానికి బయటి వస్తువులపైనో, మరే ఇతర వాటిపైనో ఆధారపడినట్లయితే కోరుకున్న విధంగా 100% జరగదు. కనుక మన వద్ద ఏమి వున్నదో దానితో సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. ఐతే మరింత ఎదుగుదల కోసం ప్రయత్నించాలి తప్ప ఎవరో ఒకరిని పోల్చుకుంటూ నిత్యం కుమిలిపోతూ వుండకూడదు. దీనివల్ల జీవితంలో గడపాల్సిన సంతోష క్షణాలు ఏమీ లేకుండానే జీవితం ముగిసిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?