Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ఏమి చేయాలి?

దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ఏమి చేయాలి?
, శనివారం, 9 నవంబరు 2019 (21:03 IST)
చాలామంది దేవాలయాలలోకి వెళ్తుంటారు. ఐతే అక్కడ భగవంతుడిని చూసి పూజ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ దేవాలయ ప్రాంగణంలో ఎలా వున్నా ఫర్వాలేదనుకుంటారు. కానీ ఆలయ ప్రాంగణంలో ఎలా వుండాలో చూద్దాం.
 
1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. 
2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు. 
4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు. 
5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. 
6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు. 
8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు. 
9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు. 
11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు. 
12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. 
13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. 
14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.  
16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.   
17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.  
18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.  
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.  
20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.  
21. గోపుర దర్శనం తప్పక చేయాలి. 
22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.  
23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు. 
24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-11-2019 నుంచి 16-11-2019 వరకు మీ వార రాశి ఫలితాలు