తిరుమల శ్రీవారి ఆలయంలోకి 18 నెలల అనంతరం ప్రవేశించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు. రమణదీక్షితులతో పాటు ఆలయ ప్రవేశం చేసిన వారిలో శ్రీనివాస దీక్షితులు, నరసింహ దీక్షితులు, వెంకటదీక్షితులు తదితరులున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రమణదీక్షితులును ఆలయ ఆగమ సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలు వినియోగించుకోనున్నారు. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ బాధ్యతలను అప్పగించాలని తితిదే యోచనగా వున్నట్లు సమాచారం.