Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

Advertiesment
Ugadi

సెల్వి

, బుధవారం, 26 మార్చి 2025 (19:20 IST)
Ugadi
ఉగాది పండుగ తెలుగు ప్రజల పండుగ. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మార్చి 30వ తేదీన ఉగాది నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను ను దక్షిణ భారతదేశంలోని కన్నడ ప్రజలు కూడా జరుపుకుంటారు. తెలుగు కొత్త సంవత్సరాదిని ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఉగాది పండుగ ప్రాముఖ్యత: 
ఇది ఆనందం, శ్రేయస్సును సూచించే పండుగ. కొత్త ప్రారంభాలను స్వీకరించడానికి ఒకరి సానుకూలమైన రోజు. అందుకే చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తుంటారు. 
 
ఉగాది 2025 తేదీ, సమయం:
2025లో ఉగాది పండుగ మార్చి 30 ఆదివారం నాడు జరుపుకుంటారు. 
తిథి మార్చి 29న సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభమై మార్చి 30న మధ్యాహ్నం 12.49 గంటలకు ముగుస్తుంది.
 
ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి:
ఉగాది పండుగ రోజున, తెల్లవారుజామున నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, పూజ చటేయాలి. తరువాత, ఉగాది పచ్చడితో పాటు వివిధ రకాల వంటకాలను తయారు చేసి జరుపుకుంటారు. ఈ రోజున పంచాంగం చదవడం చాలా శుభప్రదమని, ఇంట్లో సకల సంపదలు పెరుగుతాయని కూడా నమ్ముతారు.
 
ఉగాది పండుగ బ్రహ్మ ముహూర్త కాలంలో, సూర్యోదయానికి ముందు ఇంట్లోని పూజ గదిలో ఐదు దీపాలను వెలిగించాలి. అలాగే, పసుపు లేదా ఆవు పేడతో గణేశ విగ్రహాన్ని తయారు చేసి, గణేశుడికి గరికతో పాటు  నైవేద్యం సమర్పించి పూజించాలి. ఈ విధంగా పూజిస్తే, మీ జీవితంలో సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని  విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...