భయానికి లోనైనప్పుడు ''దుర్గాదేవిని'' జపిస్తే....
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.
Publish Date: Wed, 27 Jun 2018 (16:23 IST)
Updated Date: Wed, 27 Jun 2018 (17:36 IST)
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.
అమ్మవారిని ఆరాధించడం వలన దారిద్ర్యం, దుఃఖం నశించడమే కాకుండా భయం కూడా నివారించబడుతుంది. అందుచేత దుర్గాదేవిని రోజూ పూజించే వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
ముఖ్యంగా భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే'' ''భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.