సూర్య భగవానుడిని ఆదివారం పూజించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఆదివారం సూర్యారాధన లేదా రోజూ సూర్య ఆరాధన ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఈ స్వామియే కావడంతో.. సూర్యుడిని ఏమాత్రం మరిచిపోకూడదని ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో వుండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి.
సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాలచక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు.