Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిశేషుడు ప్రతిష్టించిన శివలింగం.. బిల్వవనంలో పరమేశ్వరుడు..

Advertiesment
ఆదిశేషుడు ప్రతిష్టించిన శివలింగం.. బిల్వవనంలో పరమేశ్వరుడు..
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:48 IST)
తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిల్లో దేని ప్రత్యేకత దానికుంది. తమిళనాడులోని కుంభకోణాన్ని ఆలయాల పుట్ట అని అంటారు. ఈ ప్రాంతం సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాల్లో మరో పవిత్రమైన ఆలయం నాగేశ్వరస్వామి దేవాలయం. పన్నెండో శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించిన దేవాలయం ఇది. 
 
చోళ శిల్పకల ఉట్టి పడుతుందిక్కడ. ఆది శేషుడు, సూర్యుడు అర్చించిన స్వామి నాగేశ్వర స్వామి. ఒకప్పుడు ఆదిశేషుడు భూబారం మోయలేక ఇక్కడికొచ్చి శ్రీ నాగేశ్వర స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాడట. శివ పార్వతులు ప్రత్యక్షమై ఆయనకు భూభారాన్ని అలసట లేకుండా మోసే శక్తి సామర్థ్యాలను వరప్రసాదంగా ఇచ్చారట. చైత్ర మాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో మూడు రోజులు సూర్యభగవానుని కిరణాలు నాగేశ్వర మహాలింగంపై పడి భక్తులకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం.
 
ఈ నాగేశ్వారస్వామి దేవాలయాన్ని కుంభకోణంలోని స్థానికులు నాగేశ్వరార్ కోవెల అంటారు. ప్రళయసమయంలో అమృతభాండం ఈ ప్రదేశానికి కొట్టుకువచ్చిందని, అందులో కొట్టుకొచ్చిన పదార్థాలు, వస్తువులన్నీ శివలింగాలు, చెట్టుగా మారాయని అంటారు. ఇక్కడ కలశంలోని బిల్వ పత్రాలు పడి బిల్వవనం ఏర్పడిందని, అప్పుడు ఆదిశేషుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
 
మన పురాణ గాధల ప్రకారం ఆదిశేషుడు భూభారాన్ని మోస్తూ వుంటాడు కదా. భూమి మీద జనం చేస్తున్న పాపాల వల్ల భూ భారం పెరిగిపోయి ఆది శేషుడికి మొయ్యలేని భారమయింది. భారాన్ని మోయలేక ఆయన కైలాసంలో శివుడికి మొర పెట్టుకున్నాడు. శివుడు ఆది శేషుడికి ఒక్క తలతోనే ఆ భారం మోసే శక్తి ఇస్తానని భరోసా ఇస్తాడు. ఆది శేషుడికి సాధారణంగా వెయ్యి తలలు ఉంటాయి.
webdunia
 
ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ శివలింగం ప్రతిష్టించి పూజించాడు. నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు గనుక ఈ స్వామి పేరు నాగేశ్వర స్వామి (తమిళంలో నాగేశ్వరర్). బిల్వ వనంలో ప్రతిష్టింపబడినాడు కనుక బిల్వవనేశ్వర్. 
webdunia
 
గర్భాలయం శివ లింగం చిన్నదే. పెద్ద పీఠంపై వుంటుంది. ఆదిశేషు ప్రతిష్టించిన లింగం కనుక రాహు దోష నివారణార్ధం భక్తులు ఇక్కడ సోమ గురు వారాలలో పూజలు చేస్తారు. రాహు దోషం వల్ల వివాహం జరగటం, పిల్లలు పుట్టటం ఆలస్యం కావచ్చు. ఆలయంలో విష్ణు దుర్గ, సూర్యనారాయణ వగైరా ఇతర దేవతా మూర్తులను కూడా దర్శించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం తిన్నట్టు కల వస్తే..?