Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్గశీర్ష పౌర్ణిమ విశిష్టత- దత్తజయంతి పూజ చేస్తే?

Advertiesment
Dattatreya
, గురువారం, 8 డిశెంబరు 2022 (11:13 IST)
మార్గశీర్ష పౌర్ణిమ విశిష్టత గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. మాసాలలో మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైంది చంద్రుడు మృగశిరా నక్షత్రానికి దగ్గరగా వుండటం చేత ఈ మాసానికి మార్గశిర మాసమని పేరు వచ్చింది. 
 
మాసానాం మార్గశిరోహం అని శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పడం చేత ఈ మాసానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఏర్పడింది. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధంచడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
అలాంటి మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత వుంది. మార్గశిర పౌర్ణమి 08-12-2022న (నేడు) వస్తోంది. ఈ రోజున దత్తాత్రేయుడు అత్రి మహర్షికి, అనసూయాదేవికి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారానికి ప్రతీక. ఈ రోజున ఆయనను ఆరాధించడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. 
 
ఇంకా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 
 
అలాగే మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. 
 
ఈ రోజు నెయ్యి దీపం వెలిగించాలి. దేవుడికి ప్రసాదం సమర్పించి.. అనంతరం దత్తాత్రేయ భగవానుని కథ వినండి. బ్రాహ్మణులకు చేతనైనంత సాయం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-12-2022 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...