ఇండోనేషియా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లికి ముందు శృంగారాన్ని నియంత్రించేందుకు జైలుశిక్షను ఖరారు చేసింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించడం ఖాయమని తెలిపింది.
ఇందుకు సంబంధించి క్రిమినల్ కోడ్‌ను త్వరలోనే తీసుకురానున్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలిపింది. భర్త లేకపోతే భార్య కానీ వారితో ఎవరైనా శృంగారం చేసిట్లైతే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష తప్పదని ఇండోనేషియా పేర్కొంది.
ఇందుకు ఆర్టికల్ 413ను ఎంచుకుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ క్రిమినల్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.