ద్రౌపది శాప ఫలం... బహిరంగంగా కుక్కల శృంగారం...
మహాభారతంలో ద్రౌపది పాత్ర ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఆమెకు ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. కలి పురుషుడు తర్వాతి జన్మలో ద్రౌపదిగా పుట్టాడని అంటారు. మహాభారత యుద్ధంలో కృష్ణుడికి సహాయం చేయడానికి ద్రౌపది జన్మించింది. మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. ఎంతమంది వచ్చి
మహాభారతంలో ద్రౌపది పాత్ర ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఆమెకు ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. కలి పురుషుడు తర్వాతి జన్మలో ద్రౌపదిగా పుట్టాడని అంటారు. మహాభారత యుద్ధంలో కృష్ణుడికి సహాయం చేయడానికి ద్రౌపది జన్మించింది. మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపేది.
ద్రౌపదికి ఉన్న వరం కారణంగా ఆమె తన భర్తలతో సంభోగించినా ఎప్పుడూ కన్యత్వాన్ని కోల్పోదు. ఒక భర్త దగ్గరి నుండి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె అగ్నిలో నడుస్తూ వెళ్లేది. అప్పుడు తన కన్యత్వాన్ని తిరిగి పొందేది. అయితే ఆమె ఒక భర్తతో ఏకాంతంగా ఉండేటప్పుడు చుట్టుపక్కలకు ఎవరూ రాకూడదు. అలా వస్తే రాజ్య బహిష్కరణ ఉంటుంది.
ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక కుక్క అక్కడికి వచ్చి గట్టిగా మొరగడమే కాకుండా ధర్మరాజు చెప్పు కూడా ఎత్తుకుపోయింది. అప్పుడు ద్రౌపది కోపంతో... మా ఏకాంతానికి భంగం కలిగించినందుకు ఈ క్షణం నుండి ఈ కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకుందు గాక అని శాపం ఇచ్చిందట.