Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

Advertiesment
Lord Narasimha Swamy Jayanthi 2026
Lord Narasimha Swamy Jayanthi 2026
ఏప్రిల్ 30, గురువారం నృసింహ జయంతి. ఈ రోజున నరసింహ స్వామిని పూజించినట్లైతే సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. 
 
అలాగే  "ఓం నమో నారసింహాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు. "నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నోః సింహః ప్రచోదయాత్" అంటూ నృసింహ గాయత్రిని జపించినా అభీష్టాలు చేకూరుతాయని విశ్వాసం.
 
నృసింహ జయంతి రోజున తులసి మాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సులు లభిస్తాయి. విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. 
 
ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు. ఆ నృసింహుని జయంతి నాడు నృసింహ మూర్తిని పూజిస్తే, జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-04-2026 బుధవారం ఫలితాలు - మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి