Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-04-2026 బుధవారం ఫలితాలు - మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

Advertiesment
Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. విందులకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
పట్టుదలతో శ్రమిస్తేనే పనులు సానుకూలమవుతాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు విపరీతం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులు మీ సమర్ధతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలు చేపడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానం కలుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా అడుగు ముందుకేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?