Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

Advertiesment
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. సన్నిహితులకు సాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల దూకుడు అదుపుచేయండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖులకు సాదర వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ధనసమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు చేరువవుతారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనులు పురమాయించవద్దు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శుభవార్త వింటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు పురమాయించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పత్రాల రెన్యువల్లో మార్పులు సాధ్యమవుతాయి
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ