Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ కృష్ణుడితో మాకేం పనుంది? రామ దర్శనానికైతే వస్తా: హనుమంతుడు

హనుమంతుడు కాలాతీతుడు. యుగాలు మారినా చిరంజీవిలా జీవిస్తున్నాడు. హనుమంతుని అనుగ్రహం పొందిన వారిలో ద్రౌపదీ దేవి కూడా ఉన్నారు. ఆంజనేయుడిని నిష్ఠగా పూజించడం ద్వారా ఆమె భర్తలైన పంచపాండవులు విజయం సాధించగలిగా

Advertiesment
Hanuman
, బుధవారం, 6 డిశెంబరు 2017 (12:16 IST)
హనుమంతుడు కాలాతీతుడు. యుగాలు మారినా చిరంజీవిలా జీవిస్తున్నాడు. హనుమంతుని అనుగ్రహం పొందిన వారిలో ద్రౌపదీ దేవి కూడా ఉన్నారు. ఆంజనేయుడిని నిష్ఠగా పూజించడం ద్వారా ఆమె భర్తలైన పంచపాండవులు విజయం సాధించగలిగారు. త్రేతాయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ, హనుమంతుడున్నాడు. సత్యభామ, గరుడుని గర్వాన్ని హనుమంతుడు భంగం చేశారు. 
 
హనుమంతుడిని సత్యభామ అహంకారాన్ని అణచివేసేందుకు శ్రీ కృష్ణపరమాత్ముడే హనుమంతునికి గరుడుని చేత కబురు పంపారట. అలా హనుమంతుని వద్దకు వెళ్లిన గరుడ భగవానుడు.. ''శ్రీ కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని హనుమంతునితో చెప్పాడు. కృష్ణుడితో మాకేం పని? మేము రామ దర్శనమైతేనే చేస్తాం అని హనుమంతుడు అన్నాడు. రాముడే పిలుస్తున్నాడని హనుమంతునితో గరుడుడు చెప్పడంతో ఏంటి నా స్వామి పిలుస్తున్నారా అంటూ ఒక్క దూకు దూకారు. అంతే గరుడుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు వృద్ధుడు అయిపోయి వుండటంతో తన వీపు మీద ఎక్కించుకెళ్లాలనుకున్నాడు. కానీ హనుమంతుని శక్తిని చులకనగా భావించిన గరుడుడి గర్వంగా అలా భంగం అయ్యింది. 
 
అలా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లిన హనుమంతునికి కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చారు. రాముని పాదాలపై పడి కన్నీటితో అభిషేకం చేసి పక్కకు చూసి అమ్మ సీతమ్మ పాదాలేవి అని అడిగాడు హనుమంతుడు. పక్కన సత్యభామ వుండటాన్ని గమనించి.. అమ్మ వుండాల్సిన దగ్గర దాసి ఉన్నదేంటి అని హనుమ అడగటంతో సత్యభామ అహం తొలగిపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసీ కాదు. ఈ అవతారమునందు నా పత్ని.

నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశంతో పుట్టిందని వివరిస్తాడు. ఇలా కృష్ణుడు చెప్పడంతో సత్యభామ అహంకారం తొలగిపోయింది. ఇలా సత్యభామ అహాన్ని తొలగించిన హనుమంతుడిని నిష్ఠతో పది నిమిషాలు స్మరించినా కోరిన కోరికలు నెరవేరుతాయి. మంగళవారం, శనివారం పూట హనుమంతుడిని పూజించిన వారికి సకలసంపదలు, నవగ్రహ దోషాలు వుండవని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి దినఫలాలు.. గణపతిని ఆవుపాలతో అభిషేకిస్తే..