Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గీత పుట్టింది ఈ రోజే.. అర్జునునికి శ్రీకృష్ణుడి ఉపదేశం.. సూక్తులు

అర్జునునికి నాడు గీతోపదేశం చేసింది.. ఈ రోజే. మనిషి తత్వాన్ని విశ్లేషించిన గీత పుట్టిన రోజు ఈ రోజే. తన బంధువులను యుద్ధంలో హతమార్చవలసి వస్తుందనే మనోవేదనతో నిలబడిన అర్జునునికి శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతను

గీత పుట్టింది ఈ రోజే.. అర్జునునికి శ్రీకృష్ణుడి ఉపదేశం.. సూక్తులు
, గురువారం, 30 నవంబరు 2017 (09:52 IST)
అర్జునునికి నాడు గీతోపదేశం చేసింది.. ఈ రోజే. మనిషి తత్వాన్ని విశ్లేషించిన గీత పుట్టిన రోజు ఈ రోజే. తన బంధువులను యుద్ధంలో హతమార్చవలసి వస్తుందనే మనోవేదనతో నిలబడిన అర్జునునికి శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతను ఉపదేశం చేశాడు. పాండవ, కౌర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి శక్తిమంతులను తన గురువులు, బంధువర్గాన్ని హతమార్చడం సరికాదని.. మనో వ్యాకులతో చెందిన వేళ.. కృష్ణుడు చెప్పిన స్ఫూర్తిదాయక మాటలే భగవద్గీత.
 
అర్జునునికి భగవద్గీతను ఉపదేశించింది. మార్గశిర శుక్ల త్రయోదశి. అది ఈ రోజు. నేడు గీతా జయంతి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కృష్ణ మందిరాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సృష్టిలోని సత్యము, రజస్సు, తమస్సు అనే గుణాలు వివిధ మనస్తత్వాలున్న వ్యక్తుల్ని ఎలా తయారు చేస్తాయని సత్యాన్ని కృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు.
 
గుణాలు మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తాయి కానీ పుట్టుక కాదని శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశించాడు. సత్యము, త్యాగము, శాంతి మొదలైన గుణాలే దైవ సంపత్తు. పొగరు, కోపం, పరుషమైన ప్రవర్తన, హింస, అసత్యం అనేవి అసురీసంపత్తు. సాధకుడు ఎలాంటి అలవాట్లు అభ్యాసం చేయాలి. ఎలాంటి వాటిని వదిలేయాలని గీతలో కృష్ణుడు ఉపదేశించాడు. సాధనమార్గంలో ఉన్న వ్యక్తికి లౌకిక సమస్యల్లో చిక్కుకున్న వ్యక్తికి భగవద్గీత చక్కగా వర్తిస్తుంది. 
 
రెండు సూక్తులు.. 
 
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||
అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.
 
 
వాసంసి జీర్ణాని యథా విహాయ 
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||
అంటే,"చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది" అని అర్ధం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#GitaJayanti : పరమాత్మతత్వాన్ని బోధించిన రోజు