జీవికి జనమరణ పరంపరలు తప్పనిసరి. జీవికి జన్మ లేకుండా మోక్షమనేది కడుదుర్లభం. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం కడుదుర్లభం. జన్ రాహిత్య సాధనకై సువర్ణ అవకాశం. మనిషి పుట్టుక మరణాల మధ్య ప్రయాణం అన్ని భగవంతుని నిర్ధేశికంగా జరిగేవే. కానీ తన ప్రమేయంతోనే జరుగుతున్నాయని, జరుపుతున్నానని మనిషి అనుకోవడం జరుగుతుంది. మానవుల త్రిగుణాల మాయ భందితులు.
రాజస తమో గుణాలతో, అహంకార, మమకారాలచే జనించబడి రాగద్వేషాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. జగత్తుకు ఆధారం భగవంతుడనే సత్యాన్ని విస్మరిస్తూ కామ ప్రేరితుడై, స్త్రీ పురుష సంయోగ కారణంగానే జీవుల సహజంగా పుట్టుక జరుగుతున్నదని, సృష్టికి కామం తప్ప వేరొక కారణం లేదని భావించడం పూర్తిగా అసురలక్షణం అని గీతాచార్యుడు చెప్పింది. అక్షరసత్యం. ఎలాంటి పొరపాట్లు లేకుండా జీవన విధానం బాగా జరుగుతున్న వారిని చూసి పెట్టి పుట్టాడు అని లోకులు అనే మాట నిజమే.
గత జన్మలో సత్కర్మలు చేసి దాచుకున్న ఫలితమే ఈ జన్మలో లభించగా అనుభవించడం జరుగుతున్నది. అలాగే తమకు కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, ఇత్యాది ఇబ్బందులు సంప్రాప్తించినప్పుడు ఇవన్నీ భగవంతుడే చేశాడనో ఇతరుల వల్ల కలుగుతున్నాయనో అనుకోవడం అజ్ఞానం. సిరి సంపదలు పెట్టి పుట్టినట్లే, కష్టాలకు కూడా గత జన్మ దుష్కర్మలు చేసిన ఫలితంగా ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి అనడం అక్షరసత్యం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు కదా.
సిరి సంపదలు అంటే మానవులు తాము సంపాదించుకున్నవనో, తమవారు సంపాదించి ఇచ్చినవనో అహంకరిస్తూ ఉంటారు. కానీ కష్టాలొస్తే మాత్రం భగవంతుడి కల్పించాడని, తమకే ఎందుకు వస్తున్నాయనో వాపోవడం జరుగుతుందే తప్ప తమ ప్రారబ్దకర్మానుసారం జరుగుతున్నవనే అని అనుకోవడం జరుగదు. లోకంలో ఘనాఘనాలు పుట్టుకతోను, జీవితంలో ఉన్నట్లే మరణం కూడా సహజంగానే ఉంటుంది. ఒక్కో ప్రాణికి అనాయాసంగా మరణం సంభవిస్తూ ఉంటుంది. మరి అంతమంది పట్ల ఎంతగా ఆ వ్యక్తి కోరుకున్నా కూడా మరణం కరుణించడం జరుగదు.
ఇది కూడా ఆ వ్యక్తి తెచ్చుకున్న కర్మ ఫలమే. మనుష్యులు కర్మలు చేయనిదే ఒక్క క్షణం కూడా జరుగదు. తప్పనిసరిగా ఏదో ఒక పనిచేయవలసినదే. అది కూడా త్రికరణ శుద్ధిగా ఏదీ ఆశించకుండా కష్టపడడం, సంపాదించు, అనుభవించు, ఏదైనా ధర్మయుక్తంగా మనుష్యులకు తమ పుట్టుక తెలియదు. మరణం ఎప్పుడన్నది తెలియదు. మధ్య జీవితం తమదనుకోవడం జరుగుతుంది. తమది ఎంతవరకు అంటే మంచి చెయ్యడం, ధర్మంగా ప్రవర్తించడం, తమ కర్తవ్యాన్ని చేస్తూ పోవాలి.
ఫలితమే కర్తలుగా భావించకుండా ఫలాలన్నీ పరమాత్మకే అనే భావనతో కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఈ విధంగా ప్రవర్తించడం కొంచెం కష్టతరమనే చెప్పాలి. ఏ పనిచేసినా ఫలితం ఆశించకుండా సామర్థ్యంతో పనిమీద దృష్టి నిలిపి పని భగవంతుని కోసం రణమైనా, రుణమైనా, ద్వందాలైనా భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించ గల భావన పెంపొందించుకుంటే జీవన యాత్రలో కర్మల ఫలాలకై ఉరకలూ, పరుగులూ ఉండవు కదా..!