బదరీ వృక్షం మహిమాన్వితం...
మహాభారత ఇతిహాసంలో భారతీయ నాగరికతలో హిందువుల పూజలలో పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. దేవునికి నివేదించో పండ్లలో రేగుపండు ఒకటి. ఈ రేగు పండునే బదరీ ఫలమని అంటారు. రామాయణంలో శబరి శ్రీరామున
మహాభారత ఇతిహాసంలో భారతీయ నాగరికతలో హిందువుల పూజలలో పాలు పంచుకుంటున్న వృక్ష జాతులలో బదరీ వృక్షం ఒకటి. దేవునికి నివేదించో పండ్లలో రేగుపండు ఒకటి. ఈ రేగు పండునే బదరీ ఫలమని అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించపండు ఈ రేగుపండే. పిల్లలకు పోసే భోగిపండ్లు కూడా రేగు పండ్లే.
సూర్యభగావానునికి రేగు పండ్లంటే చాలా ఇష్టం. రథసప్తమిరోజున చిక్కుడు ఆకులతోపాటు రేగు ఆకులను కూడా తలమీద పెట్టుకుని స్నానం చేస్తుంటారు. వినాయకుని పూజలలో కూడా ఈ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టం. అందువలనే ఈ స్వామివారికి బదరీనారాయణుడనే పేరు వచ్చింది.
వ్యాసుడు బదరీ ద్వీపంలో పుట్టినందువలనే ఆయనకు బాదరాయణుడనే పేరు వచ్చింది. శాస్త్ర గ్రంథాలలో కూడా ఈ బదరీవృక్షం అత్యంత ప్రసక్తికరమైనది. ఈ బదరీ చెట్టు పండ్లలోనే కాదు, ఆకులలోను, బెరడులోను, చివరకు గింజల్లో కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మందమతులుగా ఉన్న పిల్లలచేత ప్రతిరోజూ రేగుపండ్లను తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట.
అంతేకాకుండా ఈ బదరీ ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటిపై కూడా పూతలా వేసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చును. కొన్ని దేశాలలో వీటి లేత ఆకులను కూరగా కూడా వండుకుని తింటుంటారు. అలానే ఈ రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి వంటకాలు కూడా తయారుచేసుకోవచ్చును.