నేనో అమ్మాయిని. కానీ, నా మనసు కూడా మరో అమ్మాయినే కావాలని కోరుకుంటుంది. ఇలాంటి మనస్తత్వం నాలో ఎందుకు వచ్చిందో అర్థంకావడం లేదు. నిజానికి నేను పక్కా అమ్మాయిని. అమ్మాయికి ఉన్న అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. కానీ, మనసు మాత్రం పురుషుడుని కాకుండా మరో అమ్మాయిని కోరుకుంటోంది. ఏం చేయాలి అని అడుగుతోంది ఓ యువతి.
దీనిపై మానసిక వైద్య నిపుణులు స్పందిస్తూ, సాధారణంగా ఇలాంటి ఆలోచనలు కలిగివుండటాన్నే సెక్సువల్ ఓరియెంటేషన్ అని అంటారు. అంటే స్వలింగ వ్యక్తులకు ఆకర్షితులవడం అన్నమాట. శారీరకంగా మహిళే అయినా పురుషులను పోలినతత్వం ఉండటం వల్ల ఇలాంటి భావన కలుగుతుంది.
పురుష సంపర్కంలో ఎలాంటి తృప్తి కలగదు. అందుకే, స్త్రీపట్ల ఆకర్షణ పెరుగుతుందని మానసిక వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితిని ఇంట్లోని పెద్దలకు విడమరిచి చెప్పి సంసిద్ధం చేసే నైపుణ్యం వైద్యులకు ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశం వారికి ఇవ్వండి.
ఒకవేళ మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఎదురయ్యే అవమానాల గురించి వారికి భయాలు ఉంటే, ఉంటున్న ప్రదేశానికి దూరంగా, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవచ్చుని వైద్యులు సలహా ఇస్తున్నారు.